ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేయాల్సిందే

ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేయాల్సిందే

12-07-2019

ఆధార్‌తో పాన్‌ లింక్‌ చేయాల్సిందే

మీ పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానించారా? ఒకవేళ అనుసంధానించుకోకపోతే ఆగస్టు 31 లోగా చేసుకోండి. లేదంటే సెప్టెంబరు 1 నుంచి మీ పాన్‌ కార్డులు చెల్లవు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో 22 కోట్ల పాన్‌ కార్డులు మాత్రమే ఆధార్‌తో లింక్‌ అయి ఉన్నాయి. ఇంకా దాదాపు 18 కోట్ల మంది ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదు. ఇకపై ఐటీ రిటర్న్స్‌ కోసం ఆధార్‌ను కూడా అనుమతిస్తాం. కానీ, ఆధార్‌తో అనుసంధానం కాని పాన్‌ కార్డులను ముందు రద్దు చేస్తాం. కాబట్టి అందరూ పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి అని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. ఆధార్‌తో అనుసంధానం చేసుకోకపోతే సెప్టెంబరు 1 తర్వాత కొత్త పాన్‌ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది.