4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

12-07-2019

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

2019 డిసెంబరు 27, 28, 29 శుక్ర, శని, ఆదివారాలలో పి. బి. సిద్ధార్థ డిగ్రీ కళాశాల సభాప్రాంగణం, సిద్ధార్థ నగర్, విజయవాడలో కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకారంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం నిర్వహణలో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. 

2019వ సంవత్సరాన్ని యునెస్కో వారు అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరం (International Year of Indigenous Languages)గా ప్రకటించిన నేపథ్యంలో తెలుగు నేలపైన సజీవంగా వున్న అన్ని మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునీకరణ లక్ష్యంగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. 

మహాసభల ప్రతినిథులుగా నమోదు కాగోరువారు రూ.500/- చెల్లించవలసి ఉంటుంది.

ఈ మహాసభల సందర్భంగా ప్రపంచ తెలుగు రచయితల సంఘం నిర్మాణాన్ని ప్రధాన కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. తెలుగు భాషాభిమానులు, సాహిత్యాభిమాను లందరినీ జీవిత సభ్యులుగా చేరవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రు. 2,000/- (విదేశాలలోని తెలుగువారు US $50) చెల్లించి జీవిత సభ్యులుగా చేరవచ్చు. తెలుగు రచయితలకు తొలిసారిగా ఏర్పడనున్న ఈ అంతర్జాతీయ వేదిక నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని కోరిక. 

జీవిత సభ్యులుగా చేరినవారికి ఈ మహాసభలలో  ప్రతినిధి రుసుము చెల్లించనవసరం లేకుండా రాయితీ కల్పిస్తున్నాం. ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవిత సభ్యులందరూ ఈ మహాసభల ప్రతినిధులే!

ప్రపంచ తెలుగు రచయితల సంఘం వెబ్ సైట్: http://www.prapanchatelugu.comలో సభ్యత్వ నమోదు పత్రం ఉంటుంది. దాన్ని అక్కడే పూర్తిచేసి అప్‘లోడ్ చేయవచ్చు. 

సభ్యత్వ రుసుము, ప్రతినిథి రుసుములను డిడి లేదా చెక్కు రూపేణా పంపించవచ్చు. 

డిడిలను PRAPANCHA TELUGU RACHAYITALA SANGHAM పేర, విజయవాడలో చెల్లించే విధంగాను,  చెక్కులను ప్రపంచ తెలుగు రచయితల సంఘం పేరున వ్రాయాలి. యం.ఓ.లు మాత్రం చేయకండి. 

మీ సమాచారాన్నీ, డిడిలను, చెక్కులను పంపవలసిన చిరునామా: 

కార్యదర్శి, ప్రపంచ తెలుగు రచయితలసంఘం
1వ అంతస్థు, సత్నాం టవర్స్, బకింగ్‘హాం పేట పోష్టాఫీసు ఎదురుగా,  
గవర్నర్ పేట, విజయవాడ-520002. 
ఇ-మెయిల్: prapanchatelugu@gmail.com
సెల్: 9440167697, 9440172642

ప్రతినిధులుగా నమోదు కావటానికి చివరి తేదీ 2019 డిసెంబరు1.

మరిన్ని వివరాలకోసం https://www.facebook.com/purnachandgv/posts/2255925887858478 మీద క్లిక్ చేసి సమాచార పత్రం చూడగలరు.