రాష్ట్రపతి కి సీఎం వీడ్కోలు

రాష్ట్రపతి కి సీఎం వీడ్కోలు

15-07-2019

రాష్ట్రపతి కి సీఎం వీడ్కోలు

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ముగిసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఆయన ఢిల్లీ తిరుగు ప్రయాణమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి కోవింద్‌కు వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి జగన్‌తో పాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ఇతర ప్రముఖులు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రాష్ట్రపతిని సాగనంపారు.