18న బలపరీక్ష

18న బలపరీక్ష

16-07-2019

18న బలపరీక్ష

కన్నడ ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కారు భవితవ్యం అటో ఇటో తేలనుంది. కుమారస్వామి ప్రభుత్వ బల నిరూపణకు ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు ముహూర్తం కుదిరింది. శాసనసభా వ్యవహారాల సలహాసంఘం(బీఏసీ) భేటీలో దీనిపై నిర్ణయం జరిగింది. 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కుమార సర్కారు లో సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వానికి ఢోకా లేదని, బల నిరూపణకు ముహూర్తం నిర్ణయించాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్‌ను శాసనసభాలోనే కోరారు.