నేడు శ్రీవారి ఆలయం మూసివేత

నేడు శ్రీవారి ఆలయం మూసివేత

16-07-2019

నేడు శ్రీవారి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం వేకువజామున 5 గంటల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మూసివేయనుంది. బుధవారం వేకువజామున 1:31 నుంచి ఉదయం 4:29 గంటల వరకు చంద్రగ్రహణం ఘడియలు ఉన్నాయి. గ్రహణ సమయానికి 6 గంటలకు ముందే మందిరం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. బుధవారం ఉదయం 5 గంటలకు శ్రీవారికి సుప్రభాతం సేవతో ఆలయ తలుపులు తెరచి శుద్ధి, పుణ్యాహవచనం తర్వాత స్వామివారికి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అనంతరం ఆణివార ఆస్థానం పూర్తిచేసి ఉదయం 11 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభిస్తారు.