ఐఐటీఎం పూర్వ విద్యార్థుల విరాళం రూ.225 కోట్లు

ఐఐటీఎం పూర్వ విద్యార్థుల విరాళం రూ.225 కోట్లు

16-07-2019

ఐఐటీఎం పూర్వ విద్యార్థుల విరాళం రూ.225 కోట్లు

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి) పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో డైమండ్‌ జూబ్లీ వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 83 చోట్ల ఈ వేడుకలు నిర్వహించారని ఐఐటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా 4,800 మంది పూర్వ విద్యార్థులు రూ.225 కోట్లను ఐఐటీ అభివృద్ధి కోసం విరాళంగా అందించారని పేర్కొంది. దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె తదితర ప్రధాన నగరాలలో వేడుకలు నిర్వహించారు.