ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వీళ్లు కాదా?

ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వీళ్లు కాదా?

19-07-2019

ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వీళ్లు కాదా?

ప్రపంచ బ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వైసీపీ కాదా అని తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయడు ప్రశ్నించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ రైతుల పేరుతో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు పెట్టించారన్నారు. ఇకపై ఏ ప్రాజెక్టుకూ నిధులు రావన్నారు. వీళ్లకు అభివృద్ధి అవసరం లేదన్నారు. పులివెందుల గొడవలు ఇక్కడ కనిపిస్తున్నాయన్నారు. ఇసుక దొరక్క రేటు రెండింతలు పెరిగిపోయిందన్నారు. నిర్మాణాలు నిలిచిపోవడంతో కార్మికులు రోడ్డున పడుతున్నారు అని పేర్కొన్నారు.