TANA
Telangana Tourism
Karur Vysya Bank

జూన్‌ 2న నవ నిర్మాణ దీక్ష

19-05-2017

జూన్‌ 2న నవ నిర్మాణ దీక్ష

రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నవ నిర్మాణ ద్షీను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన నాటి సంఘలనల్ని గుర్తు చేసుకుని, అభివృద్ధి కోసం పట్టుదలతో ముందుకెళ్లేలా స్ఫూర్తి నింపేందుకు ఈ కార్యక్రమం చేపడుతోంది. జూన్‌ రెండో తేదీ నుంచి 8 వరకు నవనిర్మాణ దీక్షను జరపనున్నారు. వారం రోజులపాటు జరిగే దీక్ష సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? ఏమేం చేయాలన్నదానిపై నిర్ణయించేందుకు ఒక మంత్రుల బృందాన్ని ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కామినేని శ్రీనివాస్‌, గంటా శ్రీనివాసరావులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.