ఈ నెల 20న ఆన్‌లైన్‌ పాస్‌పోర్టు మేళా
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

ఈ నెల 20న ఆన్‌లైన్‌ పాస్‌పోర్టు మేళా

19-05-2017

ఈ నెల 20న ఆన్‌లైన్‌ పాస్‌పోర్టు మేళా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఐదు చోట్ల ఈ నెల 20న ఆన్‌లైన్‌ పాస్‌పోర్టు మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్‌పీ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సెలవు దినం అయినప్పటికీ ప్రజలు అవసరాల దృష్ట్యా విజయవాడ, తిరుపతి, భీమవరం, కాకినాడ, కర్నూలులో మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడ, తిరుపతిలో చెరో 500, భీమవరం, కడప, కర్నూలులో వంద చొప్పున స్లాట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేలా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. హాజరయ్యే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేసుకున్నాక వచ్చే ఏఆర్‌ఎన్‌కు సంబంధించిన జీరాక్సు పత్రం, ఇతర ఒరిజినల్‌ దస్తావేజులతో రావాలని సూచించారు. పీపీసీ, తాత్కల్‌, ఇతర అపరిష్కృత కేసులను ఆన్‌లైన్‌ మేళాకు అనుమతించేది లేదని చౌదరి సృష్టం చేశారు.