ఏపీ సర్కార్‌కు మరో ఝలక్‌

ఏపీ సర్కార్‌కు మరో ఝలక్‌

22-07-2019

ఏపీ సర్కార్‌కు మరో ఝలక్‌

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ సర్కార్‌కు మరో ఝలక్‌ తగలింది. విద్యుత్‌ ఒప్పందాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనుంది. అయితే ఈ సమీక్షకు హాజరుకాకూడదని కేంద్ర విద్యుత్‌ సంస్థలు ఎన్టీపీసీ, ఎస్‌ఈసీఐ నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పందాలు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. ఒప్పందానలు గౌరవించి, పెండింగ్‌ బకాయిలను వెంటనే చెల్లించాలని డిస్కంలకు ఎస్‌ఈసీఐ లేఖ రాసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్‌ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని జగన్‌ చేసిన ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ స్పందించిన విషయం తెలిసిందే.

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్‌ ప్రకటన దెబ్బతీస్తుందని హితబోధచేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్‌ నిబంధనల ప్రకారమే జరుగుతాయని పేర్కొంది. అదికూడా బహిరంగ వేళం ప్రక్రియలో సాగుతాయని గుర్తు చేసింది. 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాధక శక్తి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర ఇంధన శాఖ గుర్తు చేసింది.