చింతమడక కు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

చింతమడక కు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

22-07-2019

చింతమడక కు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

తన సొంతూరైన చింతమడకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. భవిష్యత్‌లో చింతమడక బంగారు తునక కావాలన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుడుతామని కేసీఆర్‌ తెలిపారు. చింతమడకకు 2 వేల ఇళ్లు మంజూరు చేస్తున్నాని ఆత్మీయ అనురాగ సభా వేదికపై ప్రకటించారు. కార్తీక మాసంలో చింతమడకలో గృహప్రవేశాలు జరగాలి. చింతమడక నన్ను కనిపెంచింది. చింతమడ కోసం నేను ఎంత చేసినా తక్కువే అని అన్నారు. చింతమడక కోసం అదనంగా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నానని చెప్పారు. అదనపు నిధులు ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్‌ పొందవచ్చు అని సూచించారు. ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేసుకోవాలి. అద్భుతమైన ఫంక్షన్‌ హాల్‌ నిర్మించాలి. సీసీరోడ్లు వేయించుకోవాలి. తాగు, సాగునీరు త్వరలో రాబోతోంది. చింతమడక ఒక బంగారు తునక కావాలి. ఈ గ్రామాన్ని చూసి పక్క ఊర్లు నేర్చుకోవాలి. అలాంటప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతది. చింతమడకలోని 2 వేల కుటుంబాలు బాగుపడాలి అని సీఎం ఆకాంక్షించారు.