కేటీఆర్‌కు వరల్డ్ వాటర్ కాంగ్రెస్ ఆహ్వానం

కేటీఆర్‌కు వరల్డ్ వాటర్ కాంగ్రెస్ ఆహ్వానం

24-07-2019

కేటీఆర్‌కు వరల్డ్ వాటర్ కాంగ్రెస్ ఆహ్వానం

అమెరికాలో 2020 మే 17న జరగనున్న ప్రపంచ పర్యావరణం, నీరు సదస్సులో కీలకోపన్యాసం చేయవలసిందిగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ సంస్థ నుంచి ఆహ్వానం అందింది. కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలను సదస్సులో వివరించాలని నిర్వాహకులు కోరారు. 2020 మే 17 నుంచి నాలుగు రోజులపాటు అమెరికాలోని నెవెడా రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో తెలంగాణ ప్రాజెక్టులపై కేటీఆర్‌ ప్రధాన ప్రసంగం చేయనున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి సుమారు వెయ్యి మంది జల, పర్యావరణ నిపుణులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఆయా దేశాల్లోని సాగునీటి వ్యవస్థలు, స్మార్ట్‌ వాటర్‌ కార్యక్రమాల గురించి ఈ సదస్సులో కూలంకషంగా చర్చిస్తారని పేర్కొన్నారు. 2017లో కాలిఫోర్నియాలో జరిగిన సదస్సుకు కూడా కేటీఆర్‌ హాజరయ్యారు.