వెళ్లేటప్పుడు మంచి పని చేశారు

వెళ్లేటప్పుడు మంచి పని చేశారు

24-07-2019

వెళ్లేటప్పుడు మంచి పని చేశారు

మున్సిపాలిటీలలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా, ఎన్నికల నిర్వహణకు తమ చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు కొత్త మున్సిపల్‌ బిల్లును తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ వెనక్కి పంపడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహచ్‌ స్పందించారు. గవర్నర్‌ నరసింహన్‌ జీవితంలో మంచి పని చేశారని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఇలాంటి మంచిపని చేసిన ఒకే ఒక్కడని అన్నారు. ఉన్నన్ని రోజులు భజన చేశారని, కానీ పదవిని వదిలి వెళ్లేటప్పుడు మంచి పని చేశారన్నారు. ఇదిలా ఉంటే బర్త్‌ డే సందర్భంగా హాజీపూర్‌ బాధితులను కేటీఆర్‌ ఆదుకోవాలని కోరారు. సొంతూరిని అభివృద్ధి చేసుకుంటున్నట్టే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు.