ప్రధానిని కలిసిన శ్రీలక్ష్మి

ప్రధానిని కలిసిన శ్రీలక్ష్మి

24-07-2019

ప్రధానిని కలిసిన శ్రీలక్ష్మి

జగన్‌ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి ఆమె తొలుత అమిత్‌ షాతో, తర్వాత ప్రధానితో భేటీ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌ అధికారిగా ఉన్న శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్‌పై తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రధాని, హోంమంత్రిలను ఆమె కలిసినట్టు సమాచారం.