జలవాణి కాల్‌సెంటర్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
APEDB
Ramakrishna

జలవాణి కాల్‌సెంటర్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

19-05-2017

జలవాణి కాల్‌సెంటర్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని గ్రామాల్లో  తాగునీటి  కష్టాలను తీర్చేందుకు జలవాణి పేరుతో ఏర్పాటు చేసిన  కాల్‌సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో రూపొందిన ఈ పథకంలో రియల్‌టైమ్‌ అలర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం ద్వారా ఏ గ్రామంలో తాగునీటి  సమస్య ఉన్నా, కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే సమస్యను పరిష్కరించనున్నారు. జలవాణి ద్వారా 1800 425 1899 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాలకు సురక్షిత మంచినీరు అందించడమే లక్ష్యంగా రూపొందించారు. తాగునీటి సమస్యపై ఇప్పటికే 3000 ఫిర్యాదులు వచ్చాయని వాటిలో 30శాతం పరిష్కారమైనట్లు మంత్రి వివరించారు. ఉద్దానంలో మూడు ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, జూలైలోగా మరో ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లాలోని కిడ్నీ సమస్య ఉన్న ప్రాంతాల్లో ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ  కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌,  గ్రామీణ నీటి సరఫరా పథకం అధికారులు పాల్గొన్నారు.