మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్‌

మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్‌

25-07-2019

మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నుంచి మరో నలుగురు టీడీపీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఒక్కరోజు సభ నుంచి స్పీకర్‌ తమ్మినేని సస్పెండ్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్‌, వాసుపల్లి గణేష్‌కుమార్‌, వెలగపూడి రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయస్వామి సభకు ఆటంకం కలిగిస్తున్నారని సస్పెండ్‌ చేశారు. మార్షల్‌ సాయంతో సస్పెండైన సభ్యులను బయటికి తరలించారు. ఇదిలా ఉంటే మైక్‌ అడిగితే ఇవ్వనందుకు నిరసనగా చంద్రబాబు సహా మిగతా టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్‌ చేశారు.