గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

26-07-2019

గవర్నర్‌తో చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్‌భవన్‌లో కలిసి అభినందనలు తెలియజేశారు. గవర్నర్‌ ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరైనా, ఆయనను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు చెప్పేందుకు వీలుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా సమయం తీసుకుని గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌ను పుష్ఫగుచ్చం, శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమితులైన హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు చంద్రబాబు మీడియా సమావేశంలో తెలిపారు. రాజ్‌భవన్‌ను చూసి తనకు చాలా సంతోషం కలిగిందన్నారు. ఒకప్పుడు ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆఫీసుగా ఉన్న ఆ భవనాన్ని అభివృద్ధి చేసి సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగించాం. ఆ తర్వాత కొంత కాలం ఆ భవనంలోనే హైకోర్టు పనిచేసింది. ఇప్పుడు రాజ్‌భవన్‌గా మారింది అని అన్నారు.