ఆ పని చేసిన వారికి చరిత్ర గురించి ఏమి తెలుసు?

ఆ పని చేసిన వారికి చరిత్ర గురించి ఏమి తెలుసు?

13-08-2019

ఆ పని చేసిన వారికి చరిత్ర గురించి ఏమి తెలుసు?

మోదీ ప్రభుత్వం కండ బలంతో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిందని కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. ఆ పని చేసిన వారికి 72 ఏళ్ల చరిత్ర తెలియదని అన్నారు. జమ్ము కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఏవైనా అనుమానాలు ఉంటే అవి భారతీయ జనతా పార్టీకే ఉండాలని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్లే ఆర్టికల్‌ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ రాష్ట్రంలో హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే రద్దు చేసేది కాదని ఆయన అన్నారు. తమిళనాడును కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తమిళులు చూస్తూ ఉండిపోతారా అని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 రద్దుకు ఏడు పార్టీలు మద్దతును ప్రకటించడం తనను బాధించిందని చిదంబరం చెప్పారు.