జయహో పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

జయహో పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

13-08-2019

జయహో పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

చారిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ది ప్రింట్‌ ఎడిటర్‌ చీఫ్‌ పద్మభూషన్‌ శేఖర్‌ గుప్తా చేతుల మీదుగా ఆవిష్కరించారు. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేయబడింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఎమెస్కో సంస్థ ప్రచురించింది. 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను దీనిలో పొందుపరిచారు. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్‌ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. 3648 కి.మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు, శేఖర్‌గుప్తా, రామచంద్రమూర్తి, వైఎస్సార్‌సీపీ నేతలు, సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు.