ఏపీలో ఆ ప్రాజెక్టులు ఆపేయండి

ఏపీలో ఆ ప్రాజెక్టులు ఆపేయండి

13-08-2019

ఏపీలో ఆ ప్రాజెక్టులు ఆపేయండి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను ఆపాలంటూ ఎన్జీటీ (నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌) ఆదేశాలు జారీ చేసింది. గోదావరి- పెన్నా, పురుషోత్తపట్నం-చింతలపూడి ఎత్తిపోతల పథకాలను ఆపేయాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నానే పనులు కొనసాగించాలని సూచించింది. రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాలపై జాయింట్‌ కమిటీ ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. అనుతులు లేకుండా ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారంటూ వట్టి వసంతకుమార్‌, శ్రీనాథ్‌ రెడ్డి ఫిటిషన్లు వేశారు. ఈ ఫిటిషన్‌పై స్పందించిన ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.