టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు

టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు

17-09-2019

టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుల పేర్లను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎనిమిది మందికి, తెలంగాణ నుంచి ఏడుగురికి, తమిళనాడు నుంచి నలుగురికి, కర్ణాటక నుంచి ముగ్గురికి, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి టీటీడీలో చోటు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం సృష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గొల్ల బాబురావు, నాదెండ్ల సుబ్బారావు, ప్రశాంతి, యూవీ రమణమూర్తి, మల్లికార్జునరెడ్డి, డీపీ అనంత, చిప్పగిరి ప్రసాద్‌కుమార్‌, పార్థసారథి పేర్లను ప్రకటించింది. తెలంగాణ నుంచి రామేశ్వరరావు, బి.పార్థసారథిరెడ్డి, వెంకటభాస్కరరావు, మూరంశెట్టి రాములు, డి.దామోదరరావు, కె.శివకుమార్‌, పుట్టా ప్రతాప్‌రెడ్డి పేర్లను ఖరారు చేసింది. ఢిల్లీ (శివశంకరన్‌), మహారాష్ట్ర (రాజేష్‌ శర్మ), కర్ణాటక నుంచి రమేష్‌శెట్టి, రవినారాయణ, సుధా నారాయణమూర్తి, తమిళనాడు నుంచి వైద్యనాథన్‌, శ్రీనివాసన్‌, డా.నిశ్చిత, కుమారగురు పేర్లను ప్రభుత్వం ప్రకటించింది.