పోలవరం టెండర్‌ను దక్కించుకున్న మేఘా

పోలవరం టెండర్‌ను దక్కించుకున్న మేఘా

23-09-2019

పోలవరం టెండర్‌ను దక్కించుకున్న మేఘా

పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌లో ప్రధాన డ్యామ్‌, జలవిద్యుత్‌ కేంద్రాల టెండర్‌ను మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ దక్కించుకుంది. ఈ పనులకు రూ.4,987 కోట్లను ఇనిషియల్‌ బెంబ్‌ మార్క్‌ విలువగా ప్రభుత్వం నిర్ణయించగా.. మేఘా సంస్థ రూ.4,358 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌ 1గా నిలిచింది. అంచనా విలువకంటే 12.6 శాతం తక్కువగా మేఘా ఇంజీనీరింగ్‌ సంస్థ కోట్‌ చేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.629 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. జలవనరులశాఖ ఆహ్వానించిన టెండరు నోటీసుకు మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ మాత్రమే గడువులోగా తన బిడ్‌ను దాఖలు చేసింది. ప్రీబిడ్‌ సమావేశానికి దాదాపు 8 సంస్థలు హాజరై సందేహాలు నివృత్తి చేసుకున్నా గడువు ముగిసేనాటికి మేఘా సంస్థ ఒక్కటే బిడ్‌ వేసింది.