నవంబర్‌ 18 నుంచి శీతాకాల పార్లమెంట్‌

నవంబర్‌ 18 నుంచి శీతాకాల పార్లమెంట్‌

21-10-2019

నవంబర్‌ 18 నుంచి శీతాకాల పార్లమెంట్‌

శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు నవంబర్‌ 18వ తేదీ నుంచి డిసెంబర్‌ 13 వరకు జరగనున్నాయి. 20 రోజుల పాటు పార్లమెంట్‌ సమావేశాలు ఉంటాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉభయ సభల సెక్రటరీలకు తెలియజేసింది. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, ఆర్థిక మందగమనం లాంటి అంశాలను సమావేశాల్లో లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్దంగా ఉన్నాయి. అయితే రాజ్యసభలో అధికార పార్టీకి ఎటువంటి సమస్య కనిపించడం లేదు. గత ఆరేళ్లతో పోలిస్తే ఈ సారి అధికార పార్టీకి రాజ్యసభలో కావాల్సినంత బలం ఉన్నది. ప్రతిపక్ష సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే వీలు ఉన్నది.