బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ

బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ

23-10-2019

బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ

బీసీసీఐ అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టారు. బీసీసీఐ ప్రధాన కార్యక్రమంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు జయ్‌ షా కార్యదర్శిగా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోదరుడు అరుణ్‌ ధుమాల్‌ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఎటువంటి ఎన్నికలు లేకుండానే వీరంతా ఆయా స్థానాలకు ఎంపికైన విషయం తెలిసిందే. సౌరవ్‌ గంగూలీ 13నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.