తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

12-11-2019

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

కార్తీక పౌర్ణమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. భారీగా తరలివస్తున్న భక్తుల కోసం తిరుపతిలోని కపిలతీర్థం శ్రీకపిలేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని కపిలతీర్థానికి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరి తీరంలో భక్తుల రద్దీ నెలకొంది. వలందర్‌ ఘాట్‌, అమరేశ్వర్‌ ఘాట్‌లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దుర్గా లక్ష్మణేశ్వరస్వామికి పంచామృతభిషేకం నిర్వహిస్తున్నారు. నరసాపురం కపిలమల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజాలు నిర్వహిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కూడ కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భద్రాచలంలోని గోదావరి నది వద్ద భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అంతేకాకుండా గోదావరి నదిలో కార్తీక దీపాలు వదులుతున్నారు.