టీడీపీ నుంచి వంశీ సస్పెండ్‌

టీడీపీ నుంచి వంశీ సస్పెండ్‌

15-11-2019

టీడీపీ నుంచి వంశీ సస్పెండ్‌

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. షోకాజ్‌ నోటీసు ద్వారా వంశీ వివరణ కోరనున్నారు. గురువారం వంశీ మీడియా సమవేశం నిర్వహించిన త్వరలో వైకాపాలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా ప్రభుత్వానికి తాను బేషరతుగా మద్దతు ఇస్తానని, సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనులకు అండగా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో వంశీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.