ఢిల్లీకి జనసేన అధినేత

ఢిల్లీకి జనసేన అధినేత

11-01-2020

ఢిల్లీకి జనసేన అధినేత

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హస్తినకు పయనమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుండగా మధ్యలోనే ఆయన ఢిల్లీ బయల్దేరారు. కేంద్ర ప్రభుత్వ ప్రముఖలతో సమావేశమయ్యేందుకు ఆయనకు అపాయింట్‌మెంట్‌ ఖారారైనట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. రాజధాని రైతులు ఆందోళనలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిచేందుకు పార్టీ ముఖ్య నేతలతో పవన్‌ కల్యాణ్‌ ఇవాళ సమావేశమయ్యారు. సమావేశం కొనసాగుతుండగానే హస్తిన పర్యటనకు సంబంధించిన సమాచారమందింది. దీంతో ఆయన హుటాహుటిన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ బయల్దేరారు.