రాజకీయ లబ్ధి కోసమే మూడు రాజధానులు

రాజకీయ లబ్ధి కోసమే మూడు రాజధానులు

11-01-2020

రాజకీయ లబ్ధి కోసమే మూడు రాజధానులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ ఏడు నెలల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. గతంలో ఓదార్పుయాత్ర, పాదయాత్ర చేపట్టిన జగన్‌.. ఇప్పుడు రైతులతో కనీసం మాట్లాడకపోవడం దారుణమన్నారు. పోలీసుల చర్యలతో రాజధానిలో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న మహిళల్ని పోలీసులు దారుణంగా కొట్టారని, పోలీసులు రాజధాని గ్రామాల్లో రైతుల ఇళ్లకు వెళ్లి తాళాలు వేస్తున్నారని ఆరోపించారు.