ఆయన కల నెరవేరదు : లోకేష్‌

ఆయన కల నెరవేరదు : లోకేష్‌

11-01-2020

ఆయన కల నెరవేరదు : లోకేష్‌

పోలీస్‌ బూట్లతో అమరావతిని తొక్కేద్దామని ముఖ్యమంత్రి జగన్‌ కలలుకంటున్నారని, అయితే ఆయన కల నెరవేరదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ హెచ్చరించారు. రాజధాని విభజనతో సీఎం జగన్‌ రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి ప్రణాళిక లేకుండా కేవలం రాజధాని విభజనతో ఏం సాధించాలి అనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టగం తప్ప సాధించిందేముందని నిలదీశారు. జగన్‌ మూడుముక్కలాటతో రైతులు ఆందోళనతో చనిపోతున్నారన్నారు. జై అమరావతి అన్నందుకు మహిళలపై లాఠీచార్జ్‌ చేయడం దారుణమని లోకేష్‌ దుయ్యబట్టారు.