ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ భేటీ

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ భేటీ

13-01-2020

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ భేటీ

ప్రగతిభవన్ లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి కేటీఆర్ ఉండగా..ఏపీ సీఎం జగన్ తో ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. నదీజలాలు, విద్యుత్‌ ఉద్యోగులు తదితర విభజనకు సంబంధించిన అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.