కడపలో వైసీపీకి పరాజయం
APEDB

కడపలో వైసీపీకి పరాజయం

20-03-2017

కడపలో వైసీపీకి పరాజయం

కడప స్థానిక సంస్థల ఎన్నికల స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్‌ రవి) వైకాపా అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. ప్రతీ క్షణం  వెన్నులో వణుకు పుట్టించిన కడప ఎమ్మెల్సీ కౌంటింగ్‌ అంతే ఉత్కంఠ రేపుతూ తెలుగుదేశం అభ్యర్థి విజయం కట్టబెట్టింది. వైసీపీ అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డి పై 33 ఓట్ల మెజారిటీతో రవి విజయం సొంతం చేసుకున్నారు. కడప వైసీపీ అధినేత జగన్‌ సొంత  గడ్డ కావడంతో అక్కడ గెలుపు టీడీపీకి అంతులేని ఆనందాన్నిచ్చింది. వైసీపీకి అంతే విషాదాన్ని మిగిల్చింది. తమకు మేలు చేస్తుందనుకున్న క్రాస్‌ ఓటింగ్‌ మంత్ర ఫలించకపోవడం వైసీపీని మరింత విషాదంలో ముంచెత్తింది.