ఏపీలో కొత్తగా మరో ఏడు పాస్ పోర్టు కేంద్రాలు
MarinaSkies
Kizen
APEDB

ఏపీలో కొత్తగా మరో ఏడు పాస్ పోర్టు కేంద్రాలు

19-06-2017

ఏపీలో కొత్తగా  మరో ఏడు పాస్ పోర్టు కేంద్రాలు

కొత్తగా మరో ఏడు పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవాకేంద్రాలు (పీఒపీఎస్‌కే) ఏర్పాటు చేయాలని విదేశాంగ శాఖ నిర్ణయించింది. ప్రతి జిల్లాకు పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కేంద్రం ఆయా ప్రాంతాల్లోని హెడ్‌ పోస్టాఫీసులను కూడా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా తొలిదశలో దేశంలో 86 ప్రాంతాల్లో పీఓపీఎస్‌కేల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు 52 ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కడప, కర్నూలు, నెల్లూరులో వీటిని ప్రారంభించారు. రెండో దశలో మరో 149 పీఓపీఎస్‌కేల ఏర్పాటు చేయాలని తాజాగా కేంద్ర ఆదేశించింది. అందులో రాష్ట్రానికి ఏడు కేంద్రాలు కేటాయించారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం జిల్లాలోని హెడ్‌ ఫోస్టాఫీసుల్లో వీటిని ఏర్పాటు చేస్తామని విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ఎన్‌ఎల్‌పీ చౌదరి తెలిపారు. ఇవి ఏర్పాటైతే రాష్ట్రంలో పీఓపీఎస్‌కేల సంఖ్య పదికి చేరుతుంది. విశాఖటప్నం (3), విజయవాడ, భీవమరం కేంద్రాలను కూడా కలుపుకొంటే రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు అందించే కేంద్రాలు 15కు చేరతాయి.