కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త
APEDB
Ramakrishna

కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త

19-06-2017

కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త

కర్నూలు నుంచి విమానంలో ప్రయాణించాలన్న ప్రజల చిరకాల కోరిక మరో 10 నెలల్లో తీరబోతోంది. ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓర్వకల్లు సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ వెంటనే పనులు ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విమానాల రాకపోకలను ప్రారంభిస్తామని చంద్రబాబు సృష్టం చేశారు. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఓర్వకల్లు సమీపంలో 1080 ఎకరాల  విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మించనున్నారు. ఇక్కడినుంచి చిన్న విమానాలను సమీప నగరాలకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తక్కువ దూరానికి తక్కువ చార్జి పథకం పేరుతో ప్రధాన్‌ మంత్రి ఉడాన్‌ యోజన పథకం కింద కర్నూలు నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌, బెంగళూరు వంటి ప్రాంతాలకు తక్కువ ధరకే విమానాల్లో చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చేసిన విధంగా పనులు పూర్తయితే రానున్న వేసవి కాలంలో ప్రజలు కర్నూలు నుంచి విమానాల్లో ప్రయాణించే అవకాశం లభించనుంది.