తిరుమల వెంకన్నకు ఊరట
APEDB
Ramakrishna

తిరుమల వెంకన్నకు ఊరట

19-06-2017

తిరుమల వెంకన్నకు ఊరట

తిరుమల వెంకన్నకు, ఆయన్ను సేవించే తరించే భక్తులకూ గొప్ప ఊరట. తిరుపతి లడ్డూ ప్రసాదం, తలనీలాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) నుంచి మినహాయింపు లభించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన 17వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (టీటీడీ) ఈ పన్ను పరిధిలోకి రాకుండా చేసేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించిందని, అయితే దేశవ్యాప్తంగా ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని లడ్డూ ప్రసాదానికి, తలనీలాలపై మాత్రం మినహాయింపు ఇచ్చారని మీడియా తెలిపారు. అలాగే తిరుమలలో రూ.వెయ్యి లోపు తీసుకునే అద్దె గదులకు పన్ను మినహాయింపు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించిందని, ఆపైన మాత్రం పన్ను ఉంటుందని తెలిపారు. సామాన్యులపై భారం పడకుండా, వ్యాపారస్తులను ఇబ్బందులు గురిచేయని విధంగా జీఎస్‌టీ విధానం ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి కోరినట్లు తెలిపారు.