ఘనంగా మంత్రి ఈటల కుమారుడి వివాహం
Ramakrishna

ఘనంగా మంత్రి ఈటల కుమారుడి వివాహం

19-06-2017

ఘనంగా మంత్రి ఈటల కుమారుడి వివాహం

తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కుమారుడు నితిన్‌ వివాహం క్షమితతో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. పలువురు రాజకీయ నేతలతో వేదిక కళకళలాడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ గవర్నర్‌ రోశయ్య, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఏపీ ఉపముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తి, ఎంపీ కవిత, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌ రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఏపీ మంత్రులు చినరాజప్ప, ప్రతిపాటి పుల్లారావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై నూతన వధూవరులను ఆశ్వీర్వదించారు.