జీవితాంతం ఉచిత విమానయానం!
MarinaSkies
Kizen
APEDB

జీవితాంతం ఉచిత విమానయానం!

19-06-2017

జీవితాంతం ఉచిత విమానయానం!

సౌదీ అరేబియా నుంచి భారత్‌ వెళుతున్న ఓ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానం గగనతలంలో ఉండగానే అందులో ప్రయాణిస్తున్న నిండుచూలాలు పురిటినొప్పులు పడింది. కాసేపటికి పండంటి మగపిల్లాడిని ప్రసవించింది. గగనతలంలో పుట్టిన ఈ చిన్నారికి జీవితకాలం ఉచిత విమాన ప్రయాణ పాసును జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ బహుమతిగా ప్రకటించింది. ఆదివారం తెల్లవారు జామున 2.55కి సౌదీలోని దమ్మమ్‌ నుంచి ఆ విమానం కొచ్చిన్‌కు బైలుదేరింది. మార్గ మధ్యలో ఉండగానే నిండుచూలాలికి పురిటినొప్పులు వచ్చాయి. అత్యవసరంగా దానిని దింపేందుకు విమానాన్ని ముంబయా మళ్లించారు. ఈ లోపునే అదే విమానంలో కేరళ వెళుతున్న ఓ నర్సు సాయంతో ఆమెకు సుఖప్రసవమైంది.