రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
Telangana Tourism
Vasavi Group

రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

19-06-2017

రాహుల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ 47వ పడిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా రాహుల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌ గాంధీ ఆయురారోగ్యాలతో ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు.  ఇక దేశవ్యాప్తంగా రాహుల్‌ గాంధీ అభిమానులు, కాంగ్రెస్‌ శ్రేణులు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్‌ ఇటలీ పర్యటనలో ఉన్నారు. తన అమ్మమ్మను చూడటానికి రాహుల్‌ ఇటలీకి వెళ్లారు. ప్రధాని శుభాకాంక్షలకు రాహుల్‌గాంధీ కృతజ్ఞతలు తెలిపారు.