ప్రపంచ హాకీ లీగ్‌లో భారత్ ఫైనల్‌కు చేరింది. లండన్ లో ఆదివారం (జూన్ 18) జరిగిన సెమీఫైనల్ల్లో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది. 7-1 గోల్స్ తేడాతో విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో వరల్డ్ హాకీ లీగ్ లో ఫైనల్ కు చేరుకుంది ఇండియా.
అక్షదీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, తల్వీందర్ సింగ్ తలో రెండు గోల్స్ చేసి భారత్‌ని తిరుగులేని స్థితిలో నిలిపారు. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే స్కాట్లాండ్‌ని ఓడించి శుభారంభం చేసిన భారత్.. శనివారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించింది. తాజాగా పాక్‌పై విజయం సాధించడంతో గ్రూప్-బిలో మూడు విజయాలతో లిస్టులో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.