టీవీలు పగిలాయ్ – పోస్టర్లు కాలిపోయాయి : క్రికెట్ అభిమానుల ఆగ్రహం
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

టీవీలు పగిలాయ్ – పోస్టర్లు కాలిపోయాయి : క్రికెట్ అభిమానుల ఆగ్రహం

19-06-2017

టీవీలు పగిలాయ్ – పోస్టర్లు కాలిపోయాయి : క్రికెట్ అభిమానుల ఆగ్రహం

ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ చేతిలో టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని.. కనీసం పోటీ ఇవ్వకుండా ఘోరంగా ఓడిపోవటంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు.. ఓటమి తర్వాత వాళ్ల ఆగ్రహం బద్దలు అయ్యింది. టీవీలు పగలగొట్టారు.. క్రికెటర్ల పోస్టర్లు చింపివేశారు. తగలబెట్టారు. మ్యాచ్ ముగిసిన వెంటనే రోడ్లపైకి వచ్చిన తమ నిరసన వ్యక్తం చేశారు. కెప్టెన్ కోహ్లీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అహ్మదాబాద్ లో అయితే సహనం కోల్పోయిన కొంత మంది అభిమానులు టీవీలను పగలగొట్టారు. ఇంట్లోని టీవీ సెట్ లను రోడ్లపై పడేశారు. కాన్పూర్ లో అయితే కోహ్లీ, యువరాజ్ సింగ్, అశ్విన్, ధోనీ, ఇతర ఆటగాళ్ల పోస్టర్లను తగలబెట్టారు. ఉత్తరాఘండ్ లోని అయితే మరింత పెద్ద ఎత్తున గళమెత్తారు. టీమిండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు అయితే సహనం కోల్పోయి టీవీలను బద్దలు చేవారు. జనం ఆగ్రహాన్ని గమనించిన పోలీసులు క్రికెటర్ల ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీధుల్లోనూ పహారా పెంచారు. ఏ మాత్రం శృతిమించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. అభిమానులు సహనం పాటించాలని విజ్ణప్తి చేశారు.