ఇంకా ఎన్నాళ్ళీ బానిస తత్వం... టీమిండియాకు అలాంటి లోగోనా ? 
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

ఇంకా ఎన్నాళ్ళీ బానిస తత్వం... టీమిండియాకు అలాంటి లోగోనా ? 

19-06-2017

ఇంకా ఎన్నాళ్ళీ బానిస తత్వం... టీమిండియాకు అలాంటి లోగోనా ? 

కేంద్రాన్ని ప్రశ్నించిన సీఐసీ

బ్రిటిష్‌ కాలంనాటి ‘స్టార్‌ ఆఫ్‌ ఇండియా’ను పోలివుండే చిహ్నాన్ని టీమిండియా తమ జెర్సీలపై ఇంకా ధరించడమేమిటని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), క్రీడా, న్యాయ మంత్రిత్వ శాఖలను కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) ప్రశ్నించింది. దేశ చిహ్నాలైన మువ్వన్నెల జెండా, నాలుగు సింహాలు లేదా అశోకుడి ధర్మచక్రాన్ని బీసీసీఐ ఉపయోగించేలా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కూడా ప్రశ్నించింది. అంతేకాదు లోక్‌సభలో హామీ ఇచ్చిన విధంగా బీసీసీఐని ఆర్‌టీఐ చట్ట పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇంకా ఫిక్సింగ్‌లు, బెట్టింగుల నిషేధానికి చర్యలు ఎందుకు చేపట్టడంలేదని.. తదితర అయిదు ప్రశ్నలకు నెలరోజుల్లో బదులివ్వాలని సీఐసీ కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ ఆదేశాలు జారీ చేశారు.