అసెంబ్లీ సీట్లను పెంచండి : సుజనా
APEDB
Ramakrishna

అసెంబ్లీ సీట్లను పెంచండి : సుజనా

17-07-2017

అసెంబ్లీ సీట్లను పెంచండి : సుజనా

తెలుగు రాష్ట్రాలోని శాసనసభ స్థానాలను పెంచాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్లు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. పార్లమెంట్‌లో జరిగిన అఖిలపక్షం సమావేశానికి టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు సుజనా చౌదరి, లోక్‌సభ పక్షం నాయకుడు తోట నరసింహం పాల్గొన్నారు. అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. పార్లమెంట్‌ వర్షకాల సమావేశాలు కేవలం 14 రోజులే వున్నందున వివిధ బిల్లు పాస్‌ కావడంలో ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. శాసనసభ స్థానాల పెంపునకు సంబంధించిన సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.