నీలిచిత్రాల కట్టడికి అమెరికా సంస్థ సహకారం : కేంద్రం
Nela Ticket
Kizen
APEDB

నీలిచిత్రాల కట్టడికి అమెరికా సంస్థ సహకారం : కేంద్రం

17-07-2017

నీలిచిత్రాల కట్టడికి అమెరికా సంస్థ సహకారం : కేంద్రం

పిల్లలతో కూడిన నీలిచిత్రాలను కట్టడి చేయడానికి కేంద్రం అమెరికాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ సహకారం తీసుకుంటోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మిస్సింగ్‌ అండ్‌ ఎక్స్‌ప్లాయిటెడ్‌ చిల్డ్రన్‌ (ఎన్‌సీఎంఈసీ) అనే  ఈ సంస్థ పిల్లలతో కూడిన నీలిచిత్రాల అప్‌లోడింగ్‌ సాంకేతిక వివరాలను 99  దేశాలకు అందిస్తోంది. ఈ సంస్థ ఉచితంగానే సమాచారం అందిస్తుందని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది.