సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ?
APEDB
Ramakrishna

సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ?

17-07-2017

సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌  భేటీ?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ కానున్నారా? రాజకీయ, ప్రభుత్వ వర్గాలు దీనికి అనుననే  సమాధానం చెబుతున్నాయి. అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యుల బృందం ఉద్దానం సమస్యపై ముఖ్యమంత్రితో చర్చింనుంది. ఈ సమావేశంలో పాలుపంచుకోవాల్సిందిగా పవన్‌ కల్యాణ్‌కు అహ్వానం అందింది. నేడు ఈ భేటీ జరిగే అవకాశాలున్నాయని ప్రచారం ఉంది. ఎప్పుడు? ఏ సమయంలో అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.