ఎమ్మెల్యే రోజాకు మరో షాక్‌
APEDB
Ramakrishna

ఎమ్మెల్యే రోజాకు మరో షాక్‌

17-07-2017

ఎమ్మెల్యే రోజాకు మరో షాక్‌

ఎమ్మెల్యే రోజాకు మరోసారి ప్రివిలేజ్‌ నోటీసులు అందుకున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తాజాగా స్పీకర్‌పై రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇవాళ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వచ్చి మాక్‌ ఓటింగ్‌కు పాల్పడడం సరికాదని,  స్పీకర్‌ కూడా అందుకు సహకరించారని, పదవికి గౌరవం కల్పించే విధంగా స్పీకర్‌ ప్రవర్తిస్తే బాగుంటుందని, దిగజారి స్పీకర్‌ పదవికి గౌరవం లేకుండా చేయడం అనేది ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నామని రోజా అన్నారు. ఈ వ్యాఖ్యలపై రోజాకు నోటీసులు ఇవ్వాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.  స్పీకర్‌ను కించపరిచే విధంగా అసత్యాలు మాట్లాడిన రోజాకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు అందాయి. దీంతో వైసీపీలో మరోసారి టెన్షన్‌ మొదలైంది. ఈ నోటీసులు అందితే రోజా మరోసారి సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు. గతంలో అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రోజాకు ప్రివిలేజ్‌ నోటీసులు అందిన విషయం తెలిసిందే.