రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా పార్లమెంట్లో బీజీపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటేశారు. గుజరాత్లోని నరన్పుర నుంచి అమిత్ షా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న అమిత్ షా ఇవాళ పార్లమెంట్లో ఓటేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 14 మంది రాజ్యసభ, 41 మంది లోక్సభ ఎంపీలకు తమతమ రాష్ట్ర అసెంబ్లీలో ఓటు వేసుకునేందుకు అవకాశం కల్పించింది. మొత్తం అయిదు మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటను పార్లమెంటులో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. మరో నలుగురు ఎమ్మెల్యేలు మరో రాష్ట్రంలో ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రపతి ఎన్నికల కోసం 32 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.