రాష్ట్రపతి ఎన్నికలలో ఓటేసిన సీఎం చంద్రబాబు
Nela Ticket
Kizen
APEDB

రాష్ట్రపతి ఎన్నికలలో ఓటేసిన సీఎం చంద్రబాబు

17-07-2017

రాష్ట్రపతి ఎన్నికలలో ఓటేసిన సీఎం చంద్రబాబు

భారత 14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్‌ కోడెల శివప్రసాదరావులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి ఓటును చంద్రబాబు వేయగా, రెండో ఓటును స్పీకర్‌ వేశారు. శాసనసభ ఆవరణలోని కమిటీ హాలులో పోలింగ్‌ జరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ ప్రక్రియతో అసెంబ్లీ ఆవరణలో సందడి నెలకొంది. ఎన్డీయే తరపున రామ్‌నాథ్‌ కోవింద్‌ బరిలో ఉండగా యూపీఏ అభ్యర్థి మీరా కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరుపుతారు.