రాక్‌మెన్ ఇండస్టీస్ పెట్టుబడులు రూ. 540 కోట్లు
MarinaSkies
Kizen

రాక్‌మెన్ ఇండస్టీస్ పెట్టుబడులు రూ. 540 కోట్లు

11-08-2017

రాక్‌మెన్ ఇండస్టీస్ పెట్టుబడులు రూ. 540 కోట్లు

ఇదిలా ఉంటే హీరో మోటో కార్ప్ గ్రూప్‌నకు అనుబంధంగా ఉన్న రాక్‌మేన్ ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ లో రూ.540 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.రూ.2105 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన ఈ గ్రూప్ తన ఉత్పాదక ప్లాంటును చిత్తూరు జిల్లాలో నెలకొల్పనుంది. హీరో మోటార్ కార్ప్, ఫోర్డ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ అవసరాలు తీరుస్తుంది. ఈ ఉత్పాదక ప్లాంటు ఏర్పాటయితే 4000 ఉద్యోగావకాశాలు కలుగుతాయని కంపెనీ కంపెనీ డైరెక్టర్ వీరరాఘవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు.


ఆంధ్రప్రదేశ్ ‌లో తమ ఉత్పాదక యూనిట్ ద్విచక్రవాహనాలకు, నాలుగు చక్రాల వాహనాలకు కావలసిన అల్యూమినియం డై కాస్ట్ (machine and painted) భాగాలను ఉత్పత్తి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రాజెక్ట్ ను 3 దశలలో నెలకొల్పుతామన్నారు. మొదటి దశలో 2019 నాటికి రూ.300 కోట్ల పెట్టుబడులతో 600 నుంచి 700 ఉద్యోగావకాశాలు కల్పిస్తామని వివరించారు. చిత్తూరులో నెలకొల్పే తమ యూనిట్ ద్వారా రూ.600 కోట్ల వార్షిక టర్నోవరు ఉండగలదని అంచనా వేస్తున్నట్లు కంపెనీ డైరెక్టర్ వి. వీరరాఘవన్ ముఖ్యమంత్రికి వివరించారు. భూ కేటాయింపు జరిగిన వెనువెంటనే నెలరోజుల్లో శంకుస్థాపన చేసి ప్లాంటు నిర్మిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థను ఆదేశించారు. 
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, టోరే ఇండియా విభాగం కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ షిజెకరు సెవెంగా (Shegekaru Svenaga), టోరే భారత్ విభాగం వైస్ ప్రెసిడెంట్ అజయ్ సింగ్ సిరోహి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యుకిషి దెగుషి (Yukichi Deguchi), డైరెక్టర్ కట్సుయుకి యమదే (Katsuyuki Yamade) , రాక్‌మెన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ వి. వీరరాఘవన్ తదితరులు పాల్గొన్నారు.