కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రితో లోకేష్ సమావేశం
MarinaSkies
Kizen

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రితో లోకేష్ సమావేశం

11-08-2017

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రితో లోకేష్ సమావేశం

ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామాత్రులు నరేంద్రసింగ్ తోమర్‌ను గురువారం నాడు ఢిల్లీలో కలిశారు. ఏపీకి రావల్సిన నిధుల బకాయిలను విడుదల చేయవల్సిందిగా లోకేష్ మంత్రికి విజ్ఞాపన చేశారు.

రాజధాని గృహ నిర్మాణాలకు రూ.1991 కోట్లు

కొత్త రాజధాని అమరావతిలో 2018 చివరినాటికి 2 లక్షలమంది జనాభా అవసరాలకు తగినట్టుగా గృహనిర్మాణాలు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాజధానిలో నిర్మించే ప్రతి నివాస భవనం ఐకానిక్‌గా ఉండాలని ఆయన చెప్పారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి 11 వ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సమావేశంలో ప్రభుత్వ గృహ నిర్మాణం, విద్యా, వైద్య సంస్థలు, పర్యాటక ప్రణాళికలు, పనుల పురోగతిపై చర్చించారు.
ప్రభుత్వ ముఖ్యులు, చట్ట సభల ప్రతినిధులు, అఖిల భారత సర్విస్ అధికారులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఇతర ఉద్యోగులకు 4,016 యూనిట్లు అవసరం అవుతాయని, వీటిలో 3820 యూనిట్లు బహుళ అంతస్థుల భవంతులుగా నిర్మిస్తున్నామని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టడానికి మొత్తం రూ.1991 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు 300 యూనిట్లకు గాను రూ.386 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
అఖిలభారత సర్విస్ అధికారులకు 130 యూనిట్లకు గాను రూ.167 కోట్లు, టైప్ 1 గెజిటెడ్ అధికారులకు 380 యూనిట్లకు గాను రూ.215 కోట్లు, టైప్ 2 గెజిటెడ్ అధికారులకు 340 యూనిట్లకు గాను రూ.160 కోట్లు, నాన్ గెజిటెడ్ అధికారులకు 1960 యూనిట్లుకు గాను రూ.694 కోట్లు, గ్రూప్ డి ఉద్యోగులకు 710 యూనిట్లకు గాను రూ.188 కోట్లు, ఇతర గృహాలకు రూ.180 కోట్లు వ్యయం కాగలదని అంచనా వేస్తున్నట్టు కమిషనర్ వివరించారు. స్పెషల్ పర్సస్ వెహికిల్ కింద ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టు చేపడతారు. ఈ ప్రాజెక్టు కోసం వివిధ మార్గాల ద్వారా సేకరించే నిధులను తిరిగి చెల్లించేందుకు అవసరమైనట్టుగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని, అందుకు తగిన వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేసి నివేదించాలని ముఖ్యమంతి ఆదేశించారు. జర్నలిస్టులకు నిర్మించే బహుళ అంతస్థుల భవనాలు మీడియా సిటీలో ఏ ప్రాంతంలో వస్తాయి, అక్కడి నుంచి పాలనా నగరం ఎంత దూరంలో ఉంటుందనే అంశాలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో చేపట్టబోయే ప్రభుత్వ గృహ నిర్మాణాలతో పాటే పాత్రికేయులకు కూడా బహుళ అంతస్థుల భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చిన రెండవ రోజే ముఖ్యమంత్రి తదనుగుణంగా అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం విశేషం.