రూ.200 నోట్ల వర్షం కురవనుంది.. భారీగా ముద్రణ

రూ.200 నోట్ల వర్షం కురవనుంది.. భారీగా ముద్రణ

03-09-2017

రూ.200 నోట్ల వర్షం కురవనుంది.. భారీగా ముద్రణ

కొత్తగా చలామణిలోకి తెచ్చిన రూ.200 నోట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచేందుకు రెడీ అవుతోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీలైనంత ఎక్కువగా నోట్లను ముద్రిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో ఎదురవుతున్న చిల్లర సమస్యలను అధిగమించడానికే నోట్ల ముద్రణ చేపట్టినట్టు తెలిపింది. ప్రస్తుతం కొన్ని బ్యాంకు శాఖల వద్ద మాత్రమే అందుబాటులో ఉన్న ఈ నోట్లను వీలైనంత మేరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, బ్యాంకుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఆర్బీఐ తెలిపింది. అయితే ఏటీఎంల ద్వారా అందుబాటులోకి తెచ్చే విషయమై ఎటువంటి ప్రకటన చేయలేదు.  ఏటీఎంలలో రూ.200 నోట్లను పెట్టాలంటే మిషన్లను రీక్యాలిబరేషన్ చేయాల్సి రావడంతో ఈ విషయంలో మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, కొత్తగా చలామాణిలోకి రూ.200 నోటు రావడంతో ప్రస్తుతం చలామణిలో 1, 2, 5, 10, 50, 100, 200, 500, 2000 నోట్లు వచ్చాయి.