సీఎం కేసీఆర్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు
MarinaSkies
Kizen

సీఎం కేసీఆర్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు

13-09-2017

సీఎం కేసీఆర్‌కు ఉపరాష్ట్రపతి అభినందనలు

వచ్చే విద్యాసంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు తెలుగు బోధనను తప్పనిసరి చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ఇదే విధంగా మిగతా రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకొని తమ మాతృభాషకు తొలి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

తెలంగాణలో తొలిసారిగా తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో ఒకటో తరగతి  నుంచి 12వ తరగతి వరకు కచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని విద్యాసంస్థలకు సూచించారు. తెలుగును సబ్జెక్టుగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని సృష్టం చేశారు.